అక్షరటుడే, వెబ్‌డెస్క్: Air ambulance : జపాన్(Japan)లో ఘోర విమానం ప్రమాదం సంభవించింది. నైరుతి తీరంలో ఉన్న సముద్రంలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పేషేంట్ తో సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు.
అధికారుల కథనం ప్రకారం.. ఆదివారం (ఏప్రిల్ 7) నాగసాకి(Nagasaki) ప్రిఫెక్చర్Prefecture లోని విమానాశ్రయం నుంచి ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఓ రోగిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు(Japanese Coast Guard officials) సహాయక చర్యలు చేపట్టారు. రెండు కోస్ట్ గార్డ్ విమానాలు, మూడు గస్తీ నౌకలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎయిర్ అంబులెన్స్‌లో పైలెట్ తో సహా మొత్తం ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురిని కోస్ట్ గార్డ్(Coast Guard ) అధికారులు కాపాడారు.
మృతులను రోగి మిత్సుకి మోటోయిషి(86), డాక్టర్ కీ అరకావా(34), పేషెంట్ సంరక్షకురాలు కజుయోషి మోటోయిషి(68)గా గుర్తించారు. పైలట్ హిరోషి హమదా(66), హెలికాప్టర్ మెకానిక్ కజుటో యోషిటకే, నర్సు సాకురా కునిటకే(28) ప్రాణాలతో బయట పడినట్లు అధికారులు వెల్లడించారు. లైఫ్ బోట్ జాకెట్స్ వల్ల వీరు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.