Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని విమానాశ్ర‌యం ఏర్పాటు చేయాల‌ని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి కోరారు. ఆదివారం కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి హైద‌రాబాద్‌లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జక్రాన్పల్లిలో విమానాశ్ర‌యం ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు. విమానాశ్ర‌యం ఏర్ప‌డితే చుట్టు ప‌క్క‌ల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని, తెలంగాణ యూనివ‌ర్సిటీ, బాస‌ర ట్రిపుల్ ఐటీకి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని వివరించారు. ఉత్త‌ర తెలంగాణ‌లో పారిశ్రామిక రంగం, ఉద్యోగ, వ్య‌వ‌సాయం రంగాలు బ‌లోపేతం అవుతాయ‌ని పేర్కొన్నారు.

Advertisement