అక్షరటుడే, బాన్సువాడ: ఆస్పత్రి కార్మికుల మూడు నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్‌ఎంవో సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. బాన్సువాడ ఏరియా, మాతా శిశు ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్స్, పేషెంట్ కేర్, శానిటేషన్ కార్మికులకు గుత్తేదారు నుంచి రావాల్సిన మూడు నెలలు బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. సకాలంలో వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంతోష్ గౌడ్, కమర్ అలీ, సురేఖ, సరోజ, ధనుంజయ్, రాజేశ్వరి, గంగారం, నరసవ్వ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement