అక్షరటుడే, బాన్సువాడ: కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు అన్నారు. మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం బాన్సువాడ ఎంసీహెచ్ ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 1న కార్మికులకు జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్ఎంవో సుజాతకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో సంతోష్ గౌడ్, రేణుక, సయ్యద్ కమర్ అలీ, సురేఖ, పండరి, బైరి నాగరాజు, సరోజ, సంగీత, కళ్యాణి, మౌనిక, గంగారాం, సుశీల పాల్గొన్నారు.