అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మారుతి పటేల్ రాజీనామా చేశారు. ఇటీవల సొసైటీకి చెందిన 12 మంది డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు ఇటీవల చైర్మన్‌పై అవిశ్వాస నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అవిశ్వాసానికి ముందే మారుతి పటేల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ చైతన్యకృష్ణకు ఇన్‌ఛార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినట్లు సీఈవో జాకీర్ తెలిపారు.