అక్షరటుడే, బాన్సువాడ: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం బాన్సువాడ మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ హయాంలో నియోజకవర్గంలో 24 వేల ఇల్లు కట్టకుండానే బిల్లులు లేపారన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమ జోలికి ఎవరు వచ్చినా అడ్రస్ గల్లంతవుతుందన్నారు. ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, తనను గెలిపిస్తే ప్రజల్లో ఒకడిగా ఉండి పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి పోచారం సురేందర్ రెడ్డి, మోహన్ నాయక్, దాసరి శ్రీనివాస్, బద్యా నాయక్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.