అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలో 5కే రన్ ఉత్సాహంగా సాగింది. ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ.. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బుధవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కార్పొరేషన్ కమిషనర్ మకరందు పాత కలెక్టరేట్‌లో జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్, స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారిణి శైలీ బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేశ్, వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా 5కే రన్
Advertisement
Advertisement