అక్షరటుడే, కామారెడ్డి: రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వైద్య ఆరోగ్య, పశు సంవర్ధక, రెడ్‌క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైనా ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చని వివరించారు. సమాజం కోసం రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా పశుసంవర్ధక అధికారి సింహ రావు, రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, కార్యదర్శులు రఘుకుమార్, నర్సింహం, వైద్యులు సంజయ్, శ్రీనివాస్, దేవేందర్, శ్రేష్ట, పోచయ్య, కిషోర్, ప్రోగ్రామ్ అధికారి రాధికా, సుధాకర్ పాల్గొన్నారు.