అక్షరటుడే, బోధన్: పట్టణంలోని రైల్వే గేటును గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కరీంనగర్ నుంచి బోధన్‌లోని రాకాసిపేట్ రైల్వేస్టేషన్‌కు ట్రైన్ వస్తున్న సమయంలో గేట్‌మెన్ గేటు వేస్తుండగా.. అదే సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చింది. గేటు దాటే ప్రయత్నంలో రైల్వే గేటును బస్సు ఢీకొంది. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో రైల్వేగేటు చెడిపోవడంతో కాసేపు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అనంతరం రైల్వే సిబ్బంది చేరుకుని మరమ్మతులు చేశారు.