అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని ఇబ్రహీంపేటలో గురువారం నీటి కుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమబోయ్ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే గ్రామంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న నీటి కుంటలో గురువారం మృతదేహం కనిపించగా భూమబోయ్దిగా గుర్తించారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడని సీఐ తెలిపారు.