అక్షరటుడే, బాన్సువాడ: భార్య చితకబాదుతోందని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. బాన్సువాడలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని రాజారాందుబ్బ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అర్ధనగ్నంగా రావడంతో పోలీసులు కంగుతిన్నారు. తన భార్య తరచూ తనను కొడుతుందని, ఆమెపై కేసు నమోదు చేయాలని సదరు వ్యక్తి పోలీసులను వేడుకున్నాడు. అయితే ఆ వ్యక్తి మద్యం సేవించి వచ్చాడని పోలీసులు గుర్తించారు. అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించినట్లు సీఐ కృష్ణ తెలిపారు.