అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, కంఠేశ్వర్‌లోని రిలయన్స్‌ మాల్‌ వద్ద అగ్నిమాపక విన్యాసాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్‌వో నర్సింగ్‌రావు, సిబ్బంది మధు, ప్రశాంత్, సురేష్‌, వినోద్‌, సురేష్‌ పాల్గొన్నారు.