అక్షరటుడే, ఆర్మూర్‌: పట్టణ మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. చైర్‌పర్సన్‌ లావణ్య అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో 39 అంశాలను అధికారులు చదివి వినిపించారు. అనంతరం కౌన్సిల్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్ను, కమిషనర్‌ రాజు, కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.