అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నడుస్తున్న ట్రాక్టర్‌ పైనుంచి పడి మున్సిపల్‌ కార్మికులు దుర్మరణం చెందింది. ఈ ఘటన నగరంలోని ఖిల్లా రోడ్డులో చోటు చేసుకుంది. గురువారం ఉదయం మున్సిపల్‌ ట్రాక్టర్‌పై చెత్త తరలిస్తుండగా డ్రైవర్‌ పక్కన సీటులో కార్మికురాలు లలిత(50) కూర్చుంది. ఖిల్లా రోడ్డులో వెళ్తుండగా ట్రాక్టర్‌ పైనుంచి అకస్మాత్తుగా పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ట్రాక్టర్‌ నడపడడంతోనే మున్సిపల్‌ కార్మికురాలు పడిపోయినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.