అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి యత్నించిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. బాలిక చిన్నమ్మ చూడడంతో బాధితురాలిని వదిలి పరారీ అయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోపాల్‌ మండలంలోని ఆదివారం రాత్రి ఓ యువకుడు పక్కింట్లో ఉండే ఆరేళ్ల బాలికకు చాక్లెట్‌ ఆశ చూపించి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. బాలికను ఒంటరిగా ఇంట్లోకి తీసుకెళ్తుండగా చూసిన ఆమె చిన్నమ్మ అక్కడికి చేరుకొని కేకలు వేసింది. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి అతడి ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం బాలిక కుటుంబీకులు మోపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.