అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండలం పోతిరెడ్డిపల్లి రూం తండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. నర్సింగరావు పల్లికి చెందిన బోట్ల పండరి(30) మంగళవారం తన అత్తగారి ఊరైన పిట్లం మండలం రాంపూర్‌కు బైకుపై వెళ్లాడు. రాత్రి సమయంలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా పోతిరెడ్డిపల్లి రూం తండా వద్ద రోడ్డుపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన లారీని వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. ఘటనలో పండరికి తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పండరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.