అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) ఆవరణలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆస్పత్రి ఆవరణలోని ఓ షెడ్డు కింద బల్లపై సోమవారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పడి ఉండడంతో పలువురు జీజీహెచ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా సదరు వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు సమచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు మాలపల్లికి చెందిన ఖాదర్గా గుర్తించారు. సదరు వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.