అక్షరటుడే, ఇందూరు: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా లక్ష్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పనులు త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో దుర్గాప్రసాద్, ఇంజనీరింగ్ విభాగం ఏఈలు, ఈఈలు ఉన్నారు.
బడులు ప్రారంభమయ్యేలోపు పనులు పూర్తవ్వాలి
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement