అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ సాయిబాబా దేవస్థానంలో బాబా డోలారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం రోజున నిర్వహించే వేడుకల్లో భాగంగా బాబా ఉత్సవ మూర్తిని ఆలయంలో ఏర్పాటు చేసిన ఊయలలో ఉంచి డోలారోహణ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.