అక్షరటుడే, ఆర్మూర్: అయోధ్య రాముడిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాముడిపై ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు హిందువులంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.