అక్షరటుడే, బాన్సువాడ: పార్టీ నాయకులందరం కలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆగ్రో ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ కాసుల బాలరాజు, ఆయన వర్గీయులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను ఎలాంటి పదవి ఆశించి పార్టీలో చేరలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే వచ్చానని పేర్కొన్నారు. గ్రామాల్లో కొందరు గొడవలు పడుతుంటే తానే గొడవలు సృష్టిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 2011 వరకు కాసుల బాలరాజు, తాను టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలెక్‌, పోచారం సురేందర్‌ రెడ్డి, కాసుల రోహిత్‌, మోహన్‌ నాయక్‌, అలిబిన్‌ అబ్దుల్లా, మనోహర్‌, వీరాజు, నార్ల సురేష్‌, అఫ్రోజ్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.