అక్షరటుడే, బాన్సువాడ: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, వార్డు కౌన్సిలర్లు లింగమేశ్వర్, పాశం రవీందర్ రెడ్డి, కిరణ్, వెంకట్, ఎర్వల కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు గురువినయ్‌, నార్ల రవీందర్, నార్ల ఉదయ్, అనిత, ప్రతిమ రెడ్డి పాల్గొన్నారు.