పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అక్షరటుడే, బాన్సువాడ: వడగళ్ల వర్షంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం పోతంగల్‌ మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదురు గాలులు, వడగళ్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌ గుడుగుట్ల శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Advertisement
Advertisement
Advertisement