అక్షరటుడే, బోధన్: బోధన్ ఎంపీపీ సావిత్రి భర్త, పెరిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దెరాజేశ్వర్ మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మరణించారు. రాజేశ్వర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని స్థానిక నాయకులు తెలిపారు. ఆయన మృతిపై పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు.