అక్షరటుడే, బాన్సువాడ: ఉద్యమాలు, అనేక మంది త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. 2001లో టీఆర్ఎస్ స్థాపించి అన్నివర్గాల వారిని ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యమాలు చేపడితే 2014లో తెలంగాణ సాధించుకోగలిగామన్నారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసి చూపించామన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కృష్ణా రెడ్డి, మోహన్ నాయక్, ఎజాజ్, దాసరి శ్రీనివాస్, నార్ల ఉదయ్ పాల్గొన్నారు.