అక్షరటుడే, బాన్సువాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. రూ.రెండు లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, క్వింటాలుకు రూ.500 బోనస్, కౌలు రైతుకు ఎకరాకు రూ.15వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, దాసరి శ్రీనివాస్, ఎజాజ్, మోహన్ రెడ్డి, బద్యానాయక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.