సీఎం రేవంత్‌రెడ్డితో కేకే భేటీ

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సీనియర్‌ నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కె.కేశవరావు(కేకే) శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటకు పైగా సీఎంతో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. త్వరలో తన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మితో కలిసి కేకే కాంగ్రెస్‌లో చేరనున్నారు. సోనియా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం. భేటీలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు పాల్గొన్నారు.