అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ కారులో నగదు పట్టుబడింది. మెదక్‌ జిల్లా హవేలీ ఘన్‌పూర్‌లో సోమవారం స్థానిక ఎస్సై ఆనంద్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఫార్చునర్‌ కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.1,80 లక్షల నగదు పట్టుబడింది. దీంతో వాహనంలో ఉన్న నితిన్‌ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన నగదును సీజ్‌ చేసి కలెక్టర్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేసినట్లు చెప్పారు.