అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌: బీఆర్‌ఎస్‌ను వీడిన పలువురు నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ సమక్షంలో సోమవారం గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో నాక తండా మాజీ సర్పంచ్‌ తారాసింగ్‌, పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా తారాసింగ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. పార్టీలో నేతల ధోరణి నచ్చక తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీనర్సయ్య, సీనియర్‌ నాయకులు పద్మారావు, శక్కరికొండ కృష్ణ, చాకలి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.