అక్షరటుడే, బాన్సువాడ: మిషన్ భగీరథ నీటి సరఫరా గురించి ఇంటింటికి తిరిగి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని డీఎల్పీవో నాగరాజు సూచించారు. మండలంలోని దేశాయిపేట్ రైతు వేదికలో సోమవారం బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, నిజాంసాగర్, పిట్లం మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఆపరేటర్లు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.