అక్షరటుడే, కామారెడ్డి: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్‌లోడ్ చేసుకోవాలని డీఎస్‌వో మల్లికార్జున్ బాబు రైస్ మిల్లర్ల యజమానులను ఆదేశించారు. శుక్రవారం రాజంపేట, సదాశివనగర్ మండలంలోని పలు రైస్ మిల్లులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు రైస్‌మిల్లుల్లో లారీలు వేచి ఉండడాన్ని గమనించి త్వరగా అన్‌లోడ్ చేసుకొని కేంద్రాలకు తిప్పి పంపాలని సూచించారు.
Advertisement
Advertisement