అక్షరటుడే, వెబ్‌డెస్క్: విద్యార్థి భవిష్యత్తుకు పునాది పాఠశాల విద్య. తొలిమెట్టు సరిగ్గా వేస్తేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. స్కూల్ స్థాయిలోనే పిల్లలకు సరైన ఒలంపియాడ్ విద్యతో కూడిన ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అందకపోతే ఇంటర్మీడియట్‌తో పాటు జాతీయస్థాయిలో ఐఐటీ, మెడికల్ విద్యలో రాణించడం కష్టతరమవుతుంది. స్కూలింగ్ నుంచే ఉత్తమ విద్యనందించడం వల్ల భవిష్యత్తులో పిల్లలు బాగా రాణించగలుగుతారు. ఇందుకు ఒలంపియాడ్ విద్యతో కూడిన ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఎంతో దోహదం చేస్తుందని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్, విద్యావేత్త ఎస్‌కే రాజా చెబుతున్నారు. పిల్లల స్కూలింగ్ స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..
- ప్రస్తుతం జాతీయ విద్య అయిన ఐఐటీ, మెడికల్‌లో ఇంటర్మీడియట్ స్థాయిలో రాణించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు స్కూల్స్ స్థాయిలోనే ఒలంపియాడ్ విద్య అందించాలి.
- ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్ కలిగి ఉన్న ఒలంపియాడ్ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించడం ఎంతో ఉత్తమం.
- పాఠశాలల్లో రెగ్యులర్ స్కూలింగ్ సిలబస్, అనుభవజ్ఞులైన టీచర్లతో పాఠాలు బోధిస్తున్నారా అనేది చూసుకోవాలి.
- ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో ఒలంపియాడ్ విద్యతో కూడిన ఐఐటీ, మెడికల్ ఫౌండేషన్‌లో ప్రతి సబ్జెకుపై నిత్యం శిక్షణ ఇచ్చే పాఠశాలల్లో చేర్పించడం వల్ల పిల్లలు బాగా రాణించగలుగుతారు.
- అంతేకాకుండా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా మారాలంటే.. స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర ఆక్టివిటీస్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లతో పాటు అనుభవజ్ఞులైన యాజమాన్యంతో పటిష్టమైన విద్యా ప్రణాళికలు అమలు పరిచే ఒలంపియాడ్ స్కూల్స్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
- స్కూల్ స్థాయిలో తీసుకున్న ఒలంపియాడ్ విద్యతోనే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారు. ఇంటర్మీడియట్‌లోకి వచ్చాక కోచింగ్ గురించే ఆలోచిస్తే ప్రయోజనం ఉండదు. అందుకే పాఠశాల స్థాయిలో ఉత్తమ విద్య అందించాలి. తల్లిదండ్రులు పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.