అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే కేసులో కీలకమైన ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి విచారిస్తోంది. అయితే తాజాగా కవిత ఆస్తులపై ఈడీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కవితతో పాటు ఆమె భర్త అనిల్ ఆస్తులపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే వీరి బంధువుల ఇళ్లలో శనివారం తనిఖీలు జరిపారు. ప్రధానంగా కవిత ఆస్తుల చిట్టాను బయటకు తీస్తున్నారు. ఆమెకు సంబంధించిన నిజామాబాద్ లోని ఆస్తులపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా త్వరలో ఈడీ బృందం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.