అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం మాజీ మంత్రి, ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌తో దానం భేటీ అయిన ఫొటో బయటకు వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు.
Advertisement
Advertisement