అక్షరటుడే, ఆర్మూర్: లక్ష్మి కాలువ ఆయకట్టు కింద ఉన్న పంటలకు మరో తడి నీళ్లివ్వాలని ఎస్సారెస్పీ ఎస్‌ఈ, సీఈలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కాలువ ఆయకట్టులోని పంటలు ఎండిపోకుండా ఉండాలంటే మరో 10 రోజుల పాటు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్నారు. నీటి అలకేషన్ లేని ప్రాంతాలకు వరద కాలువ ద్వారా 4 టీఎంసీల నీటిని దిగువకు వదిలారని పేర్కొన్నారు. కానీ అలకేషన్ ఉన్న లక్ష్మి కెనాల్, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి, నవాబ్ లిఫ్ట్‌ల ఆయకట్టుకు నీరివ్వకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతోందన్నారు. అధికారులు స్పందించి లక్ష్మి కాలువకు నీరివ్వాలని కోరారు.