అక్షరటుడే, కామారెడ్డి: జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగంచుకుంటున్నారు. నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు మొత్తం 12.88 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా బాన్సువాడలో 15.71 శాతం, అత్యల్పంగా ఆందోల్‌లో 11.48 శాతం పోలింగ్ జరిగింది. ఎల్లారెడ్డిలో 14.17 శాతం, నారాయణ్‌ఖేడ్‌లో 12.71శాతం, జుక్కల్‌లో 12.58 శాతం, కామారెడ్డిలో 12.49 శాతం, జహీరాబాద్‌లో 11.84 శాతం పోలింగ్ నమోదైంది.