అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: అగ్ని ప్రమాదాల నివారణపై జిల్లా కోర్టులో గురువారం అగ్ని మాపక సిబ్బంది అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫైర్‌ స్టేఫీ అధికారులు ఈ కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సునీత కుంచాల, జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.