అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో ఫుడ్‌ స్టేఫీ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు జరిపారు. ఇందులో భాగంగా ఎమ్మెస్సార్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఆహారంలో కలిపే రంగులు, పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్‌ చేశారు. హోటళ్ల యజమానులు నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే విక్రయించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఫుడ్‌ స్టేఫీ ఆఫీసర్‌ తారాసింగ్‌ నాయక్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.