అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి బల్దియా పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఆమెను ఎన్నుకున్నారు. బల్దియాలో 49 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్‌ అఫీషియోతో కలిసి మొత్తం 50 మంది సభ్యులున్నారు. ఎన్నిక సందర్భంగా క్యాంపునకు వెళ్లిన కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నేరుగా ఉదయం మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. సమావేశానికి కేవలం కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. సరిపోనూ కోరం సభ్యులు ఉండడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. దీంతో కౌన్సిలర్లు ఇందుప్రియను చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.