అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎట్టకేలకు తనిఖీలు మొదలయ్యాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన బృందాలు సోమవారం ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభించాయి. వాస్తవానికి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఆదేశాలున్నాయి. కానీ, జిల్లాలో మాత్రం ఆర్మూర్, బోధన్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలో వందల సంఖ్యలో ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండగా.. ఇక్కడ తనిఖీలు చేపట్టలేదు. అధికార యంత్రాంగానికి ఏమాత్రం సంబంధం లేని ఐఎంఏ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలోనే తనిఖీలకు వెళ్లవద్దని సిబ్బందికి సూచించారు. ఈ విషయమై అక్షరటుడే
లో కథనం ప్రచురితం కాగా.. ఉన్నతాధికారులు స్పందించారు. మొక్కుబడి తనిఖీలపై ఆరా తీశారు. సోమవారం నుంచి నగరంలోని అన్ని హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ సెంటర్స్ లో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో బృందాలు అన్ని హాస్పిటల్స్ లో జల్లెడ పడుతున్నాయి.