అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా 20 మందికి స్థానచలనం కల్పించారు. త్వరలోనే ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.