అక్షరటుడే, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మూడున్నర నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారి నుదుటిపై పడ్డాయి. ఈ అద్భుతాన్ని భక్తులు తిలకించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రతియేటా శ్రీరామనవమి రోజున ఈ దృశ్యం కనిపించనుంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో ప్రత్యేక అలంకరణలో బాల రాముడు దర్శనమిచ్చారు.