అక్షరటుడే, జుక్కల్‌: కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్‌ పార్టీయేనని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ధీమా వ్యక్తం చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌ రాజు, కాంగ్రెస్‌ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డితో కలిసి జుక్కల్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు జయ ప్రదీప్‌, రవీందర్‌ రెడ్డి, మల్లికార్జున్‌, ఆకాష్‌, గంగి రమేశ్‌, సవాయిసింగ్‌, లోక్య నాయక్‌, సరస్వతి, నాగభూషణం, గొట్టం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.