అక్షరటుడే, జుక్కల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు హెచ్చరించారు. ఆదివారం జుక్కల్ మండలం ఖండేబల్లూర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తాలు పేరుతో తరుగు తీస్తున్నారని.. తేమశాతం చూడడం లేదని ఎమ్మెల్యేకు రైతులు వివరించారు. బస్తాకు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారని.. అడిగితే దుర్భాషలాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ ఐకేపీ నిర్వాహకుడికి ఫోన్‌చేయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఉన్నతాధికారులకు ఫోన్ చేసి రైతులను దుర్భాషలాడిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. అలాగే తూకం తగ్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.