అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ‘కోల్‌కతా’ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.