అక్షరటుడే, కామారెడ్డి: పిల్లల్లో నులి పురుగుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 20న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో నులి పురుగులు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు 2,50,254 పిల్లలునన్నట్లు గుర్తించామన్నారు. నులిపురుగుల సమస్య ఎదురుకాకుండా వీరికి అల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శిరీష, డీపీవో శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా సంక్షేమాధికారి బావయ్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డీఈవో, మెప్మా అధికారులు పాల్గొన్నారు.