అక్షరటుడే, కామారెడ్డి: పాఠశాలల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపిక చేసిన కామారెడ్డి మండలం గర్గుల్ ఎంపీపీఎస్, సదాశివనగర్ మండలం తుక్కోజి వాడి పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులు, ఎంఈవో ఎల్లయ్య తదితరులున్నారు.