అక్షరటుడే, కామారెడ్డి: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం స్వీప్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో సుమారు 30 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారని, గత శాసనసభ ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని ప్రశంసించారు. ఇంకా ఎవరైనా ఓటరుగా నమోదు చేయించుకోని వారుంటే వెంటనే హెల్ప్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని, ఈ నెల 25న ఓటరు తుదిజాబితా విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య, స్వీప్‌ నోడల్‌ అధికారి వెంకటేశ్‌, ట్రాన్స్‌ జెండర్లు పాల్గొన్నారు.