అక్షరటుడే, కామారెడ్డి: అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శనివారం అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదాములు, షాపింగ్‌మాళ్లలో ప్రమాదాలు జరగకుండా యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక కేంద్రం అధికారి సయ్యద్ మహమ్మద్‌అలీ, సిబ్బంది రవీందర్‌రెడ్డి, లక్ష్మణ్, సాయిబాబా, నరేందర్ రావు, డి.స్టాలిన్, వై.శ్రావణ్, బి.రమేశ్, జలంధర్, వెంకటి, దేవరాజు పాల్గొన్నారు.