అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీలో ప్రధానమంత్రి నుంచి కార్యకర్త వరకు ఒకే కుటుంబమని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలో శనివారం టిఫిన్ బైటక్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి అల్పాహారం ఆరగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల మధ్య సోదరభావం పెంపొందించేందుకు టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.